Wednesday, April 24, 2024
- Advertisement -

సుమ వయస్సుపై నాగబాబు కామెంట్..!

- Advertisement -

నాగబాబు జబర్దస్త్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్కిట్ లకు నవ్వి నవ్వి ఆయన కూడా కామెడీ చేయడం మొదలు పెట్టాడు. పైకి చాలా సీరియస్ గా కనిపిస్తారు కానీ చాలా సరదాగా ఉంటారు. ఇక జబర్దస్త్ లో ఆయన వేసే పంచ్ డైలాగ్స్ కి కూడా తిరుగుండదు. అప్పటికి అప్పుడు పంచులు వేసి తెగ నవ్విస్తారు. తాజాగా ప్రముఖ ఛానెల్ లో దివాళి సందర్భంగా ఉత్తమ పురుషులు ఈవెంట్ చేస్తున్నారు.

అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో అదిరిపోయే పంచులు ఉన్నాయి. ప్రధానంగా నాగబాబు తన స్పెషల్ లుక్ తో అదరగొట్టాడు. ఈ కార్యక్రమంలో సుమ కనకాలతో పాటు సుడిగాలి సుధీర్, చంద్ర, చంటీ హోస్టులుగా ఉన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన నాగబాబు.. సుమ కానకాల వయసుపై అదిరిపోయే పంచ్ వేశాడు. సీనీయర్ యాంకర్స్ లో సుమ ముందు స్థానంలో ఉంటుంది. ఇప్పటికే ఆమె వయసుపై చాలా ట్రోల్స్ వచ్చాయి.

అయితే సుమ కూడా తన వయస్సుపై వస్తున్న ట్రోల్స్ ను కామెడీగా తీసుకుంటుంది. ఇప్పుడు నాగబాబు కూడా ఇలాంటి పంచ్ డైలాగ్ ఒక్కటి వేశాడు. ఇంత సన్నగా ఎలా అయిపోయారని నాగబాబును సుడిగాలి సుధీర్ అడుగుతాడు. అందుకు బదులిస్తూ.. అరే సుధీర్.. మన సుమ ఏం చెప్పిందిరా.. రోజులో 4 గంటలు తిని.. 20 గంటలు కష్టపడమని చెప్పారు అంటాడు నాగబాబు. దానికి వెంటనే పెద్దోళ్లు కదా సర్ చెప్పింది అంటే.. ఇక్కడ నీకంటే పెద్దోళ్లు ఎవరున్నారు సుమ అంటూ పంచ్ వేశాడు. నాగబాబు వేసి పంచుకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -