Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ డబ్బు పంపిణిపై స్పందించిన నాగ‌బాబు

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఆయ‌న త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ నుంచి న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో ధ‌న ప్ర‌వాహం భారీ ఎత్తున జ‌రిగింద‌ని అంద‌రికి తెలిసిన స‌త్య‌మే. ఈ ఎన్నిక‌ల్లో ఓటుకి రెండు వేలు నుంచి మూడు వేలు వ‌ర‌కు పంచిపెట్టార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఉన్న రాజకీయాల్లో డ‌బ్బు లేనిదే ఓటు వేయించుకోలేమ‌ని నాయ‌కులు భావిస్తున్నారు.

అయితే ఇది ఖ‌చ్చితంగా సాధ్యం అవుతుంద‌ని అంటున్నారు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. తాము ముందుగానే డ‌బ్బు పంపిణి చేయ‌కుడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నామని. అదేవిధాంగా మేము కాని మా పార్టీ నాయ‌కులు కాని ఎక్క‌డ కూడా ఓటు కోసం డబ్బు పంపిణి చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు నాగ‌బాబు. ఇక తాను పోటీ చేసిన న‌ర‌సాపురం పార్ల‌మెంట్ నియోజిక వ‌ర్గంలో అయితే ప్ర‌జ‌లు ఎందో బాధ్య‌త‌తో ఓటు వేశారని తెలిపారు నాగ‌బాబు.

ఎప్పుడూ అరవై శాతం మాత్రమే ఓటింగ్ వచ్చే అక్కడఈసారి 81 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైందని అన్నారు. ఇదే తరహాలో కొనసాగితే 2024లో జరగబోయే ఎన్నికల్లో 95 శాతం ఓటింగ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. ఇదే క‌నుక జ‌రిగిదే రాబోయే ఎన్నిక‌ల్లో డ‌బ్బు కాన్సెప్ట్ పని చేయనట్లేనని ,ఇక ఏ నాయకుడు డబ్బులతో ఓట్లను కొనలేడని అన్నారు. కాని అన్ని పార్టీల‌కు మాదిరిగానే కార్యకర్తలకు భోజనం పెట్టడం, పెట్రోల్ ఖర్చులు చూసుకోవడం వంటివి మాత్రం చేశామ‌ని చెప్పుకొచ్చారు నాగ‌బాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -