Thursday, April 25, 2024
- Advertisement -

ఘనంగా జరిగిన నిహారిక నిశ్చితార్థం.. అల్లుడిపై నాగబాబు కామెంట్..!

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగింది. గురువారం రాత్రి ప్రయివేట్ హోటల్ లో చైతన్య జొన్నలగడ్డ, నిహారిక కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలో వైరల్ అవుతున్నాయి. ఇక వరుణ్ తేజ్ నిహారికకు అన్నయ్య అయినప్పటికి ఒక ఫ్రెండ్ లా ఉంటాడు. ఇక తన బేబి నిశ్చితార్థం చేసుకుంది అంటూ తన బావకు హృదయపూర్వక స్వాగతం తెలియజేశాడు వరుణ్ తేజ్.

ఇక నాగబాబు కూడా తన కూతురిపై ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉంటాడు. ‘ప్రతి ఒక్కరు చెబుతుంటారు తను చాలా విషయాల్లో నాలనే ఉంటుందని. నాకు నమ్మకం ఉంది తనపై నువ్వు అపారమైన ప్రేమను కురూపించగలవని. ఇక నేటి నుంచి ఆమె అధికారికంగా నీ సమస్య’ అంటూ సరదాగా అల్లుడిపై కామెంట్ చేశారు నాగబాబు. ఈ ఎంగేజ్మెంట్ లో కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది మాత్రమే కనిపించారు.

మెగాస్టార్ చిరంజీవి తన శ్రీమతి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఇక రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, కూడా వారి భార్యలతో వేడుకలో పాల్గొన్నారు. ఇక యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మెగా సిస్టర్స్ కూడా నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. అందుకే ఫోటోస్ కూడా ఎక్కడ కనిపించలేదు.

పెళ్లి చేసుకుని.. నా లైఫ్ లో పెద్ద తప్పు చేశా : ప్రగతి ఆంటీ

వందల కోట్లు వద్దని.. మాములు అసిస్టెంట్ ను పెళ్లి చేసుకున్న రాశీ..!

wow 3 : నీ వల్లే కరోనా వచ్చింది : అనసుయపై సుమ ఫైర్..!

నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించి గొడవ పడ్డాం : సాయి ధరమ్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -