Friday, April 19, 2024
- Advertisement -

‘మ‌జిలీ’ చూస్తే ‘జెర్సీ’ చూసిన‌ట్లేనా..?

- Advertisement -

మ‌జిలీ రెండు వారాల క్రితం విడుద‌ల అయిన సినిమా. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌, స‌మంతలు హీరో, హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిలిచింది. క్రికెట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కించిన ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. జీవితంలోని మొద‌టి ప్రేమ ఎప్ప‌టికి మ‌రిచిపోలేరని ఈ సినిమాతో మ‌రోసారి నిరుపించారు.

ప్రేమించిన అమ్మాయి దూరం కావ‌డంతో ఇష్ట‌మైన క్రికెట్‌ను కూడా వ‌దులేసుకునే పాత్రలో నాగ‌చైత‌న్య అద్భుతంగా న‌టించాడు. ఇక న్యాచుర‌ల్ స్టార్ నాని తాజాగా న‌టించిన సినిమా జెర్సీ. ఈ సినిమా కూడా క్రికెట్ ప్ర‌ధానంశంగా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో కూడా ఏదో ఒక కార‌ణంతో ఎంతో ఇష్ట‌మైన క్రికెట్‌ను వ‌దులుకొవాల్సి వ‌స్తుందని టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థం అవుతోంది. ఏది ఏమైన‌ప్ప‌టికి ఈ రెండు సినిమాలు కూడా క్రికెట్‌ను బేస్ చేసుకుని తెర‌కెక్కించిన సినిమాలు కావ‌డంతో క‌థ ఒకేలా ఉంటుంద‌ని చాలామంది న‌మ్ముతున్నారు.

అయితే మ‌జిలీలో చైతు మ‌ళ్లీ క్రికెట్ ఎక్క‌డ ఆడిన‌ట్లు క‌నిపించ‌డు. కాని జెర్సీలో నాని 36 ఏళ్ల వయ‌స్సులో తిరిగి బ్యాట్ ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌జిలీ మొద‌ట విడుద‌లై సేఫ్ సైడ్ అవ్వ‌డం మాత్రం ఆ సినిమాకు ఫ్లస్ పాయింట. జెర్సీ సినిమా మాత్రం విడుద‌ల కావాల్సి ఉంది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోతే మాత్రం జెర్సీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక జెర్సీ సినిమాను ఈ నెల 19న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -