Friday, March 29, 2024
- Advertisement -

హృద‌యాల్ని హ‌త్తుకునే ‘మ‌జిలి’ (ట్రైల‌ర్‌ )

- Advertisement -

అక్కినేని నాగ‌చైత‌న్య , స‌మంతలు పెళ్లి త‌రువాత న‌టిస్తున్న సినిమా మ‌జిలి. నిన్నుకోరి వంటి డిఫ‌రెంట్ క‌థ‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్న శివ నిర్వాణ మ‌రో కొత్త పాయింట్‌తో మ‌జిలి సినిమాను తెర‌కెక్కించాడు. విడ‌ద‌ల అయిన టీజ‌ర్ , సాంగ్స్‌కు మంచి రెస్ప‌న్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. సినిమా మొత్తం నాగ‌చైత‌న్య చూట్టునే తిరుగుతోంద‌ని ట్రైల‌ర్‌ను చూస్తుంటే ఇట్టే అర్ధం అవుతోంది. యువ‌కుడిగా స‌మ‌యంలో ల‌వ్ , ఆ త‌రువాత ఆ ప్రేమ విఫ‌లం చెందిన వ్య‌క్తిగా, ఇష్టంలేని పెళ్లి చేసుకోవ‌డం ఇలా క‌థ అంతా నాగ‌చైత‌న్య చూట్టునే తిరుగుతోంది. కథలో చాలా ఎమోషన్ ఉన్నట్టు స్పష్టంగా చూపించేశారు.

కోరుకున్నది దక్కనప్పుడు రగిలిపోయే యువకుడిగా చైతు మంచివాడైన భర్త కేవలం కొన్ని అలవాట్ల వల్ల దారి తప్పుతున్నాడు కాబట్టి ఎలాగైనా అతన్ని మార్చుకుని దగ్గర కావాలని తపనబడే భార్యగా సమంతా ఇద్దరూ ఆలా బాగా న‌టించారని ట్రైల‌ర్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రు చెబుతున్నారు. కథలో చాలా ఎమోషన్స్ చూపించాడు ద‌ర్శ‌కుడు. విడాకులు మాత్రం అడగకండి అంటూ ట్రైల‌ర్లో చివర్లో స‌మంత చెప్పే డైలాగ్ హైలెట్ అని చెప్పాలి. నిజ జీవితంలో భార్యాభర్తలు అయిన నాగ‌చైత‌న్య , స‌మంత రీల్ జీవితంలో ఎలా ఉంటారో చూడాల‌ని అంద‌రికి అతృత‌గా ఉంది. ఈ సినిమాను ఈనెల 5న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -