Wednesday, April 24, 2024
- Advertisement -

కలెక్షన్ల పరంగా కూడా ఫ్లాప్ అయిన మన్మధుడు

- Advertisement -

2002 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ గా ‘మన్మధుడు 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి నెగటివ్ రెస్పాన్స్ ను అందుకుంటోంది. విడుదలకు ముందు నుంచే సినిమాపై అంతగా బజ్ లేదు. ఇక రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదలైంది. ఇప్పటిదాకా ఈ సినిమా కేవలం 8.8 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక అటు ఓవర్సీస్ లో కూడా వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం.

బక్రీద్ హాలిడే వచ్చినప్పటికీ ‘మన్మధుడు 2’ సినిమా కలెక్షన్ల పరంగా ఏమంత హడావిడి చేయలేదు. నిజానికి ఆదివారం వసూళ్ళలో పోల్చుకుంటే సోమవారంనాడు 50 శాతం పడిపోయాయి. మరోవైపు ఓవర్సీస్లో 600 వేల డాలర్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కాగా సినిమా ఇప్పటిదాకా 230 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇంతకుమించి కలెక్షన్లు ఊపందుకోవడం జరగని పని అని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మన్మధుడు’ సినిమా డిజాస్టర్ గా మారింది.

ఏరియా వైస్ గా మన్మధుడు 2 కలెక్షన్స్ ఇలా ఉన్నాయి:

నిజాం: 2.35
సీడెడ్: 0.90
యూఏ: 0.82 కోట్లు
గుంటూరు : 0.86 కోట్లు
ఈస్ట్: 0.46 కోట్లు
కృష్ణ: 0.58 కోట్లు
వెస్ట్: 0.46 కోట్లు
నెల్లూరు: 0.27 కోట్లు

ఏపీ/తెలంగాణ: 6.70 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1 కోట్లు

ఓవర్సీస్: 0.95 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా: 8.65 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -