Friday, April 19, 2024
- Advertisement -

60 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్న మన్మధుడు

- Advertisement -

టాలీవుడ్ లో ఉన్న చాలావరకు హీరోలందరూ కమర్షియల్ సినిమాల పైన దృష్టి పెడుతుంది వేరే జోనర్ల లోకి మారాలంటే కొంచెం కష్టపడుతూనే ఉంటారు. కానీ అలాంటి వారికి భిన్నంగా అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ‘మన్మథుడు’ వంటి రొమాంటిక్ కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా ‘శివ’ వంటి సినిమాలు, ‘రాజుగారి గది 2’ వంటి హారర్ సినిమాలలో సైతం నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. చూడటానికి మాత్రం ఇంకా నవమన్మధుడు లాగానే కనిపించే నాగార్జున ఇవాళ తన అరవైవ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులు మరియు కొందరు సెలబ్రిటీలు కూడా నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ మధ్యనే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మధుడు 2’ సినిమాలో కనిపించిన నాగార్జున ఆ సినిమాతో డిసాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -