Friday, April 19, 2024
- Advertisement -

గీతాంజలి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా ?

- Advertisement -

ఇక్కడ కనిపిస్తున్న హీరోయిన్ ను ఈ తరం వాళ్లు గుర్తు పట్టడం కాస్త కష్టమే. సడెన్ గా చూస్తే 80.. 90 ల సిని ప్రేమికులు కూడా గుర్తు పట్టలేరు. ఎందుకంటే ఇప్పుడు ఈమె వయసు 50. అయితే నటించింది మాత్రం నాలుగైదు సినిమాలే. వాటిలో ఒకటే హిట్టు. అదే నాగార్జున కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోయిన ‘గీతాంజలి’.

ఈమె పేరు గిరిజ అని కొంతమందికి గుర్తు రావొచ్చు. గిరిజ షెట్టార్. మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన గీతాంజలి సినిమా తర్వాత గిరిజ ఓ మూడు నాలుగు సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ‘గీతాంజలి’ సినిమా చూసిన వారెవరూ గిరిజను మర్చిపోలేరు. ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గా ఈమె ట్విట్టర్ లో గీతాంజలి సినిమాకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ను షేర్ చేసుకుంది.

అప్పటి జెనరేషన్ వారికి గీతాంజలి సినిమా అంటే ఓ మరపురాని జ్ఞాపకం. ఇక అల్లరిపిల్ల పాత్రలో గిరిజ నటించిన తీరు కూడా ఎవరూ మర్చిపోలేరు. ఇంతకాలం తర్వాత అదే హీరోయిన్ ట్విట్టర్ లో యాక్టివ్ కావడం అప్పటి అభిమానులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -