Friday, March 29, 2024
- Advertisement -

బిగ్ బాస్ అలీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున..!

- Advertisement -

ఇండస్ట్రీలో కింగ్ నాగార్జునకు మంచి పేరు ఉంది. అయిన ఎవరికైన ఓ మాట ఇస్తే నిలబడుతారు. అలానే చాలా మంది కొత్త డైరెక్టర్లకు మాట ఇచ్చి వాళ్లతో సినిమా తీశారు. ఇది పక్కనపెడితే మరోసారి నాగ్ తన మాట నిలబెట్టుకున్నారు.

తను ప్రామిస్ చేసిన విధంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ అలీ రెజాకు బ్రాండెడ్ షూస్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు. దాంతో అలీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇటీవలే బిగ్ బాస్ మూడో సీజన్ కు నాగార్జున హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. ఈ షోలో ఒక కంటెస్టెంట్‌గా అలీరెజా పాల్గొన్నాడు. హౌస్‌లో అలీ చాలా స్టైలిష్ గా ఉండేవాడు. అతని డ్రెస్సింగ్ ను నాగార్జున చాలా సార్లు ఇష్టపడేవారు. ఒక వీకెండ్ కార్యక్రమంలో నాగార్జున ధరించిన బ్రాండెడ్ షూస్ ను అలీ ఇష్టపడ్డాడు.

అలాంటి షూ తనకు కావాలని నాగ్ ను కోరాడు. కచ్చితంగా గిఫ్ట్ ఇస్తానని నాగ్ ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసిన విధంగా అలీరెజాకు నాగ్ తాజాగా గిఫ్ట్‌ పంపించారు. నాగార్జున గుర్తుపెట్టుకుని మరీ తన కోరిక నెరవేర్చడంతో అలీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నిజంగా మాట మీద నిలబడే వ్యక్తి. తన ఫేవరెట్ బ్రాండ్ షూస్‌ను నాగార్జున నాకు గిఫ్ట్‌గా పంపించారు.

బిగ్ బాస్ అలీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున..!అలాంటి షూస్ కావాలని బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నాగార్జునగారిని కోరాను. మాట ఇచ్చిన విధంగా నాకు ఇప్పుడు పంపించారు. లవ్యూ నాగార్జున సర్` అంటూ అలీ ట్వీట్ చేశాడు. నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను కూడా పంచుకున్నాడు. అయితే ఈ షోస్ ఖరీదు దాదాపుగా 30 వేల ఉండొచ్చని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -