Friday, March 29, 2024
- Advertisement -

కన్ఫ్యూజన్ లో ఉన్న కింగ్

- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరియర్లోనే క్లాసిక్ హిట్ గా నిలిచిన ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ గా ‘మన్మధుడు 2’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర బృందం సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతుంది అని చెప్పి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ‘మన్మధుడు 2’ సినిమా ‘సాహో’ కి కేవలం వారం ముందు మాత్రమే విడుదల కాబోతోంది. ‘సాహో’ మాత్రమే కాక ఇంకా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

దీంతో నాగార్జున కూడా కొంచెం కన్ఫ్యూషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా నటించిన ‘రణరంగం’ ఆగస్టు 2న విడుదల కాబోతుంది. అడవి శేష్ ‘ఎవరు’ సినిమా ఆగస్టు 23న, మరోవైపు నాని గ్యాంగ్లీడర్ సినిమా ఆగస్టు 30న విడుదల కానున్నాయి. వెంకటేష్-నాగచైతన్య మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామ’ మరియు వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా గోపీచంద్ ‘చాణక్య’ సెప్టెంబర్ లో విడుదల అవుతున్నాయి. కానీ నాగార్జున ‘మన్మధుడు 2’ సినిమా కి సోలో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నాగార్జున ‘మన్మధుడు 2’ విడుదల తేదీని వాయిదా వేయనున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -