Friday, April 19, 2024
- Advertisement -

బాలకృష్ణ పిలువు వేరే.. అలా అంటే కొట్టేస్తా : నగ్నం హీరోయిన్ కామెంట్స్

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ తీసిన నగ్నం సినిమాలో హీరోయిన్ నటించింది స్వీటీ శ్రీరాపక. ఇటీవలే వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈమె ఇండస్ట్రీలో క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా 40పైగా చిత్రాలకు పని చేసింది. అయితే ఇటీవలే ఇంటర్వ్యూలో బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యాలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో నాకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదు. ఎందుకంటే.. నేను ఎవరిదగ్గరకూ ఆర్టిస్ట్‌గా వెళ్లలేదు.. ప్రొఫెషనల్ డిజైనర్‌గా వెళ్లా. టెక్నీషియన్‌తో మాట్లాడటానికి భయపడతారు. గౌరవం ఇస్తారు.

ఆర్టిస్ట్ అంటే అది అంటారు.. టెక్నీషియన్ అంటే మేడమ్ అంటారు. నా వరకూ నన్ను ఇండస్ట్రీలో పులి అంటారు.. శ్రీ మేడమ్ వచ్చేసింది.. పులి బాబోయ్ అంటారు. అంతెందుకు నేను బాలక్రిష్ణ గారితో వర్క్ చేశా.. ఆయన మహిళా ఆర్టిస్ట్‌లను అదీ.. ఇదీ.. డామ్.. డిస్క్ అంటారు. నాకు మీటింగ్ ఎప్పుడూ ఆయన ఇంట్లోనే జరిగేది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్లాల్సి వచ్చేది. బాలయ్యకు కోపం ఎక్కువ అనే మాట నిజమే. షార్ట్ టెంపర్ ఉంది. ఆయనతో నేను ఆయన ఇంట్లోనే ఈ సినిమా కోసం 15-20 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆయన నన్ను చూసి నార్త్ అమ్మాయిని అనుకున్నారు. తెలుగు అని అనుకోలేదు. కాని నేను చాలా ట్రెడిషనల్‌గా చుడీదార్ వేసుకునే వెళ్లా. మరి ఆయనకు అలా ఎందుకు కనిపించానో తెలియదు కాని.. ఎక్కడ నుంచి వచ్చావ్ అన్నారు.. వెస్ట్ గోదావరి సార్!! అని అనగానే.. తెలుగు అమ్మాయివా అన్నారు. నేను పులి కావొచ్చు.

కానీ ఆయన పెద్ద పులి కదా.. అందుకే కాస్త భయంగానే ఆయన దగ్గర ఉన్నాను. ఆయనతో డిస్కషన్ ముగిసిన తరువాత.. సార్!! ఓ రిక్వెస్ట్ అన్నాను.. ఏంటో చెప్పు అన్నారు బాలక్రిష్ణ గారు. ‘మీరు డిజైనర్స్‌ని కొడతారంట కదా..? నిజామేనా?? మీరు జూన్ 10న పుట్టారు.. నేను 13న పుట్టాను సేమ్ మెంటాలిటీ అని చెప్పా. ఎందుకంటే ఆయన కొడితే తిరిగి కొట్టేస్తా అని ఇన్ డైరెక్ట్‌గా చెప్పా. ఆయనది నిజంగానే కిడ్ మెంటాలిటీ.. చాలా సరదాగా ఉంటారు. అప్పుడే కోపం వస్తుంది. అప్పుడే నవ్వేస్తారు.. ఆయనలాగే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ’ అంటూ తనను బాలయ్య బాబుతో పోల్చుకుంటూ కామెంట్స్ చేసింది నటి స్వీటీ శ్రీపాక.

టీవీ సీరియల్ నటి నవ్యకు కరోనా..!

వర్మ ‘పవర్ స్టార్’ సినిమా హీరో దొరికేశాడు..!

శ్యామ్, సాయిసుధ కేసులో సంతకాన్ని మార్ఫింగ్.. కొత్త ట్విస్ట్..!

అల్లరి నరేష్ ‘నాంది’ టీజర్ టాక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -