Thursday, March 28, 2024
- Advertisement -

మ‌హేశ్ ప‌క్క‌న న‌మ్ర‌త అందంగా లేదా..?

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తాజాగా న‌టించిన చిత్రం మ‌హ‌ర్షి. గ‌త గురువారం విడుద‌ల అయిన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో చిత్ర యూనిట్ సక్సెస్ సంబ‌రాలు చేసుకుంది. ఈ స‌క్సెస్ మీట్‌లో మ‌హేశ్ భార్య న‌మ్ర‌త‌ కూడా పాల్గొంది. అయితే న‌మ్ర‌త‌ను ట్రోల్ చేశాడు ఓ నెటిజ‌న్‌. నమ్రత మీరు ఎందుకు మేకప్ వేసుకోవు.. ఏదైనా ఫోబియాతో బాధ పడుతున్నావా.. లేదా డిప్రెషన్ లో ఉన్నావాస , మ‌హేశ్ ప‌క్క‌న మీరు అంత అందంగా క‌నిపించ‌డం లేదని కామెంట్స్ చేశాడు.

దీనికి ఆ నెటిజ‌న్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌రిచ్చింది న‌మ్ర‌త‌. నీకు స‌హజం అందం న‌చ్చ‌ద‌నుకుంటా. నీలాంటి వాళ్లకు మేకప్ వేసుకున్న మహిళలంటేనే ఇష్టమానుకుంటా. ఇక మీద నువ్వు అలాంటి వాళ్ల‌నే ఫాలో అవ్వు , అప్పుడు ఇలాంటివి చూసే బాధ నీతో పాటు మాకు త‌ప్పుతుంద‌ని తెలిపింది. కాబట్టి నువ్వు నన్ను అన్ ఫాలో చెయ్.. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్.. అంటూ ఆ నెటిజ‌న్‌కు దిమ్మ‌తిరిగే కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆ నెటిజ‌న్ నుంచి మ‌రోమాట రాలేదు. న‌మ్ర‌త రియాక్ష‌న్‌పై అభిమానులు ప్రశంసలు వ‌ర్షం కురిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -