మోక్షజ్ఞ ఎంట్రోపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!

1820
nandamuri Balakrishna About His Son Mokshagna Debut
nandamuri Balakrishna About His Son Mokshagna Debut

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ‌ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు హీరోలుగా దూసుకొస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి 9 మంది హీరోలుగా వచ్చారు. ఇక అక్కినేని, ఘటమనేని హీరోలు తమ సత్తా చాటుతున్నారు.

ఇంకోవైపు మరోవైపు బాలయ్య తరువాతి జనరేషన్‌లో మహేష్ బాబు వారసుడు గౌతమ్.. పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరా కూడా హీరో అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. అయితే బాలకృష్ణ కొడుకు మాత్రం గత ఐదేళ్ళు నుంచి ఎంట్రీ ఇస్తారనే అంటున్నారు తప్పా ఎప్పుడో చెప్పడం లేదు. మోక్షజ్ఞ‌ను డైరెక్ట్ చేయబోతున్నారనే వార్తలు రాగా.. లక్కీ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ అయితే కరెక్ట్ అని బాలయ్య భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై బాలయ్య స్పందిస్తూ తప్పకుండా మోక్షజ్ఞ‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని క్లారిటీ ఇచ్చారు. ’మోక్షజ్ఞ‌ సినిమాల్లోకి రావడానికి చాలా ఇంట్రస్ట్‌గా ఉన్నాడు.. డెఫనేట్‌గా సినిమాల్లోకి వస్తాడు.

అతనికి వేరే దారిలేక కాదు.. సినిమాలంటే చాలా ఇంట్రస్ట్‌గా ఉన్నాడు. అతన్ని బలవంతంగా తోయడం లేదు.. సినిమాలంటే ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి ప్రోత్సహిస్తా.. మా నాన్న గారు నన్ను సినిమాల్లోకి రామని బలవంతం చేయలేదు.. నేను కూడా అంతే. నా కొడుకు ఇంట్రస్ట్ ఉందంటేనే ప్రోత్సహిస్తా అంటూ 2018లోనే తెలిపిన బాలయ్య.. తాజాగా మరోసారి మోక్షజ్ఞ‌ ఎంట్రీపై స్పందిస్తూ త్వరలోనే సినిమాల్లోకి వస్తాడని తెలిపారు. అందుకు ప్రత్యేకమైన ప్లాన్ ఏం లేదు. మంచి సందర్భం చూసి హీరోగా పరిచయం చేస్తాను” అని అంటూ మోక్షజ్ఞ‌ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ ఇచ్చారు.

చిరు వర్సస్ బాలయ్య ఇష్యూపై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!

నాగబాబు, జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందించిన బాలయ్య..!

బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడంపై బాలయ్య స్పందన..!

Loading...