Thursday, April 25, 2024
- Advertisement -

బాలయ్య- కె ఎస్ రవి కుమార్ కథ పై క్లారిటీ

- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ ఏ సినిమా చేయబోతున్నాడు అని అభిమానులు చాలా రోజులు కన్ఫ్యూషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు బాలయ్య ‘జైసింహ’ ఫేమ్ దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా కి హడావిడి లేకుండా క్లాప్ కొట్టారు. నిజానికి సీ కళ్యాణ్ కి బాలయ్య ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారు. కానీ అంతా రెడీ అయ్యాక ఏపీలో రాజకీయాలు మారాయి. కాబట్టి అప్పటి పరిస్థితులను బట్టి సిద్ధం చేసుకున్న కథ ను పక్కన పెట్టాల్సి వచ్చింది.

ఈ సమయంలో కే ఎస్ రవికుమార్ తో బాలయ్య సినిమా ఉంటుందా లేదా అని బోలెడు సందేహాలు కలుగుతాయి. అయితే అప్పటికప్పుడు పరుచూరి మురళి ని రంగంలోకి దింపి ఆయనతో కొత్త కథను రాయించారు. ఇప్పుడు ఆ కథనే ఫైనలైజ్ చేశారు. మళ్లీ కె.ఎస్.రవికుమార్-బాలయ్య కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ‘క్రాంతి’ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారు కానీ బాలయ్య మాత్రం ‘రూలర్’ టైటిల్ పై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘రూలర్’ అనేది రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదని క్యారెక్టరైజేషన్ బట్టి వాడుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల సెట్స్ పైకి వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -