వైరటీ గెటప్స్‌తో అదరగొడుతున్న బాలయ్య

520
Nandamuri Balakrishna Ruler New look
Nandamuri Balakrishna Ruler New look

లేటెస్ట్‌ లూక్‌లో బాలయ్య అదరగొడుతున్నాడు. రూలర్‌ మూవీ కోసం వైరటీ గెటప్స్‌లో బాలకృష్ణ ఆకట్టుకుంటున్నాడు. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో రూలర్‌ సినిమాలో రెండు వెరైటీ పాత్రల్లో బాలయ్య కనిపించనున్నారు. పోలీసాఫీసర్‌గా, ఐటీ ప్రొఫెషనల్‌గా ఆయన నటిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రయూనిట్‌ విడుదల ఫస్ట్‌ లుక్స్‌ పోస్టర్స్‌ అభిమాలకు విపరీతంగా నచ్చేశాయి. నట సింహం న్యూలుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. తాజగా విడుదల చేసిన పోస్టర్‌ కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. ‘రూలర్‌’ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది.

Loading...