Thursday, March 28, 2024
- Advertisement -

నేను కూడా చనిపోదాం అనుకున్నా : నందినీ రాయ్

- Advertisement -

బాలీవుడ్ హీరో సుశాంత్ డిప్రెషన్ కి లోనై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ కంటే ముందు చాలా మంది సెలబ్రిటీలు ఇలానే చేసుకున్నారు. డిప్రెషన్ నుంచి బయటపడినవారు తక్కువ. ఈ క్రమంలో ఇప్పుడు ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు తాము డిప్రెషన్ కి గురైన విషయాల్ని.. అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో బహిరంగంగా వెల్లడిస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో హీరోయిన్ బిగ్ బాస్ భామ నందినీ రాయ్ కూడా చాలా సార్లు డిప్రెషన్ కి లోనై ఆత్మహత్య చేసుకోవాలనుకున్ననని చెప్పింది. నందినీ రాయ్ తెలుగులో ‘హార్మోన్స్’ ‘మాయ’ ‘మోసగాళ్ళకు మోసగాడు’ ‘సిల్లీ ఫెలోస్’ వంటి సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ‘బిగ్ బాస్’ రెండవ సీజన్ లో అడుగుపెట్టి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా నందినీ రాయ్ మాట్లాడుతూ..”2011లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. 2015లో ‘మోసగాళ్లకు మోసగాడు’లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడం వల్ల పూర్తిగా నిరాశ చెందాను. దీంతో ఒత్తిడిలోకి వెళ్లిపోయాను. ఇండస్ట్రీలో విజయాలతో పాటు పాపులారిటీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. అది క్రమంగా మానసిక ఒత్తిడి పెరిగి డిప్రెషన్ కు దారి తీస్తుంది” అని చెప్పుకొచ్చింది.

ఇంకా నందిని మాట్లాడుతూ.. ఒకానొక టైంలో ఇంటి టెర్రస్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. దాదాపు రెండేళ్ల పాటు మానసిక వేదన అనుభవించాను. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక నన్ను నేను స్ట్రాంగ్ గా మార్చుకున్నాను. డిప్రెషన్ లో ఉంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. నలుగురితో కలవరు. నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేందుకు స్నేహితులతో మాట్లాడేదానినని.. డాక్టర్స్ వద్ద కౌన్స్లింగ్ తీసుకున్నానని.. యోగా వ్యాయామాలు చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చానని ఈ అందాల భామ చెబుతోంది.

కమెడియన్ విద్యుల్లేఖ ఎంత సన్నబడిందో చూడండి..!

ఫ్యాదర్స్ డే రోజు కళ్యాణ్ కి సర్ప్ రైజ్ ఇచ్చిన పెద్ద కూతురు..!

ఫాదర్స్ డే రోజు దిల్ రాజుకి సర్ ఫ్రైజ్ ఇచ్చిన కూతురు హన్షిత..!

భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -