Friday, March 29, 2024
- Advertisement -

అద్భుతమైన పాటతో వచ్చేసిన ‘గ్యాంగ్ లీడర్’

- Advertisement -

‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ అనే ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘హొయ్ న హొయ్ న’ అనే మొదటి పాటను ఇవాళ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ‘జెర్సీ’ సినిమాకి అద్భుతమైన అందించిన అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి కూడా చాలా చక్కని సంగీతాన్ని అందించారు.

అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ సినిమాకి మరియు పాటకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఇన్నో జంగా గొంతు పాట కి చాలా చక్కగా సూట్ అయింది. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సినిమాపై అంచనాలను పెంచుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా లో లక్ష్మీ, శరణ్య పొంవణ్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 30న విడుదల కావాల్సిన ఈ సినిమా ‘సాహో’ వాయిదా పడటం వలన సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -