Friday, April 26, 2024
- Advertisement -

దారివ్వమని నాని ని అడగాల్సిన అవసరం ప్రభాస్ కి ఏంటి?

- Advertisement -

గత రెండు రోజులు గా ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం వాయిదా పడుతుంది అనే సంకేతాలు మీడియా లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాహో సినిమా రేంజ్ కి డిలే అవ్వడం అనేది సాధారణమైన విషయమే కానీ ఈ రేంజ్ లో డిలే ఉంటుంది అనేది మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఇక విడుదల కి కూడా ఎక్కువ సమయం లేదు అనుకుంటున్నా తరుణం లో ఈ సడన్ డిలే ఫాన్స్ ని నిరుత్సాపరిచింది. అయితే సాహో తప్పుకుంటుంది అని తెలిసి వెంటనే రణరంగం, ఎవరు సినిమా సభ్యులు రిలీజ్ డేట్స్ మార్చేసుకున్నారు.

విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు సాహో ఆగస్టు 30 న రానుంది అని టాక్ నడుస్తుంది. కాకపోతే సాహో అప్పుడు ,రావాలంటే, ఆల్రెడీ విడుదల తేదీ ప్రకటించిన గ్యాంగ్ లీడర్ మేకర్స్ వెనక్కి తగ్గాలి. గ్యాంగ్ లీడర్ సినిమా ఇప్పటికే పూర్తి కావొచ్చింది. సడన్ గా వాయిదా అంటే ఎంత వరకు జరిగే పని అనేది తెలియదు.

ఇకపోతే ఇండస్ట్రీ టాక్ ప్రకారం సాహో మేకర్స్ వెళ్ళి నాని గ్యాంగ్ లీడర్ మేకర్స్ ని తన సినిమా వాయిదా వేసుకోవాలని కోరగా, వారు కాదన్నారట. అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సాహో పెద్ద సినిమా. ఈ సినిమా నిర్మాతలు వెళ్ళి వేరే సినిమా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం లో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం పై కొంత మంది సందేహాలు రేకెత్తిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -