Wednesday, April 24, 2024
- Advertisement -

నాని హీరోయిన్ కి తమిళ పరీక్ష

- Advertisement -

జెర్సీ సినిమా తో తెలుగు తెర కి పరిచయం అయిన హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్. ఈ సినిమా లో శ్రద్ద నటన అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. అయితే తెలుగు లో పెద్దగా ఈ భామ కి అవకాశాలు లేనప్పటికీ హీరోయిన్ గా మాత్రం చాలా బిజీ గా గడుపుతుంది. ఈ వచ్చే శుక్రవారం నాడు ఆమె నటించిన తమిళ సినిమా నెర్కొండ పార్వై విడుదల కానుంది. బాలీవుడ్ విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన పింక్ సినిమా కి రీమేక్ గా ఈ సినిమా తమిళం లో వస్తుంది. హిందీ లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర ని ఇక్కడ తమిళం లో అజిత్ కుమార్ పోషించారు. అలాగే తాపీసీ పోషించిన పాత్ర లో శ్రద్ధ మెరవనుంది.

ఇకపోతే అసలు విషయానికి వస్తే ఈ సినిమా విజయం శ్రద్ద కెరీర్ కి చాలా కీలకం గా మారనుంది. ఈ సినిమా విజయం సాధిస్తే ఖచ్చితంగా శ్రద్ద కి కోలీవుడ్ లో తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు కూడా తమిళం లో నటించిన శ్రద్ద పెద్దగా తన మార్క్ ని కనబరిచే ప్రయత్నం ఏమి చేయలేదు. అందుకని ఈ సరి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా తో శ్రద్ద ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -