Wednesday, April 24, 2024
- Advertisement -

‘మ‌జిలీ’ని క్రాస్ చేయ‌లేక‌పోయిన‌ నాని ‘జెర్సీ’

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన జెర్సీ సినిమా నిన్న‌నే(శుక్ర‌వారం) విడుద‌ల అయింది. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు మ‌ళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వ‌హించారు.క్రికెట్ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో నాని త‌న స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడని సామాన్య ప్రేక్ష‌కుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు చెబుతున్నారు. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి క‌లెక్ష‌న్స్ మాత్రం ఏమాంత గొప్ప‌గా లేవ‌ని తెలింది.

ఇటీవ‌ల విడుద‌ల అయిన నాగ‌చైత‌న్య మ‌జిలీ క‌లెక్ష‌న్స్ కూడా నాని జెర్సీ క్రాస్ చేయ‌లేక‌పోయింద‌ని తెలుస్తోంది. మ‌జిలి యూఎస్ఏ ప్రీమియ‌ర్ షోలకు 1,63,000 డాల‌ర్లు వ‌సూలు చేస్తే, జెర్సీ మాత్రం 132 లొకేష‌న్ల‌లో కేవ‌లం 143,632 డాల‌ర్ల‌ను మాత్ర‌మే ప్రీమియ‌ర్ షోల ద్వారా రాబ‌ట్టగ‌లిగింద‌ని సినీ ఎన‌లిస్టులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కువ ఏరియాల్లో మొద‌టి రోజు క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌డ‌టంలో జెర్సీ కాస్త వెన‌క‌బ‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -