Friday, March 29, 2024
- Advertisement -

నాని ‘జెర్సీ’ మూవీ రివ్యూ

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన గ‌త రెండు సినిమాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో రేసులో బాగా వెన‌క‌ప‌డ్డాడు. నాని తాజాగా న‌టించిన చిత్రం జెర్సీ. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు మ‌ళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వ‌హించారు. క్రికెట్ ప్ర‌ధాన అంశంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజే(శుక్ర‌వారం) విడుద‌ల అయింది. టీజ‌ర్, ట్రైల‌ర్‌తో ఆక‌ట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకుల‌ను ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా ఇప్ప‌టికే ఆమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో విడుద‌ల అయింది. అక్క‌డ నుంచి వ‌స్తున్న స‌మీక్ష‌(రివ్యూ) ఎలా ఉందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

కథ :
అర్జున్ (నాని) తన వివాహ జీవితానికి ముందు క్రికెట్‌ను అమితంగా ఇష్ట‌ప‌డతాడు. క్రికెట్ త‌ప్ప మ‌రో లోకం తెలియ‌ని అర్జున్ జీవితంలోకి హీరోయిన్(శ్రద్ధ శ్రీనాథ్ ) ఎంట్రీ ఇస్తుంది. ఆ త‌రువాత అర్జున్ కొన్ని కార‌ణల‌తో క్రికెట్‌కు దూరం అవుతాడు. కానీ మళ్ళీ పదేళ్ల తర్వాత తాను కోల్పోయిన లక్ష్యాన్ని మళ్ళీ అందుకోవాలని ఆశిస్తాడు.ఆ నేపథ్యంలో అర్జున్ ఎదుర్కున్న పరిణామాలు ఏమిటి? భారత జట్టుకు ఎంపిక కావాలనే తన ప్రయత్నం ఫలించిందా? 36 ఏళ్ల వ‌యస్సులో అర్జున్ ఏం సాధించాడు? ఈ విధంగా అర్జున్ జీవితం ఎమోషనల్ గా ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
జెర్సీ టైటిల్‌తోనే త‌న క‌థ ఏంటో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. దీనికి తగ్గట్టుగానే గౌతమ్ కూడా ఈ చిత్రాన్ని చాలా డీసెంట్ గా తెరకెక్కించారు. నాని నుంచి మంచి ఎమోషన్‌ను రాబట్టారు.అలాగే 1986 మరియు 1990లలో ఉండే వ్యత్యాసాలను తెర మీద చక్క‌గా చూపించారు. అయితే సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువుగా ఉండ‌టం వలన ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసిన‌ట్లుగా అనిపిస్తుంది. ఈ విషయంలో ద‌ర్శకుడు కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.

న‌టీన‌టుల ఫ‌ర్మామెన్స్‌:
త‌న సహజ నటనతో నాచురల్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాని తన కెరీర్ లో బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఈ సినిమాకి ఇచ్చాడు. ముఖ్యంగా తన కొడుకు విషయంలో మరియు ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో నాని కనబర్చే సహజ నటన సినిమా చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రెండు షేడ్స్‌లో కనిపించిన నాని నటన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. హీరోయిన్‌శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలామంచి ఫ‌ర్మామెన్స్ ఇచ్చింది. ప్రియురాలుగా, భార్య‌గా, త‌ల్లిగా ఇలా మూడు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించి మెప్పించింది.అలాగే నాని కొడుకుగా నటించిన రోహిత్ కమ్రా,సత్య రాజ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం అందించారు.

సాంకేతిక ప‌రిజ్ఞానం ప‌నితీరు:
సినిమాలోసాంకేతిక విలువులు బాగున్నాయి. సినిమా క‌థ అనుగుణంగా 1990లో జ‌రిగిన‌ట్లుగా తెర మీద చూపించ‌డానికి బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. అనిరుద్ అందించిన సంగీతం విన‌డానికి క‌న్నా చూస్తే చాలా బాగుంది. ఇక నేప‌థ్యం సంగీతంతో తాను ఏంటో మ‌రోసారి నిరుపించుకున్నాడు అనిరుద్‌. కెమెరా మ్యాన్ ప‌నిత‌నం బాగుంది. ద‌ర్శ‌కుడు గౌతమ్ తిన్ననూరి మ‌రోసారి మంచి క‌థ‌తో ప్రేక్ష‌కులను మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.

బొట‌మ్ లైన్‌:
క్రికెట‌ర్ మెప్పించిన నాని

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -