Wednesday, April 24, 2024
- Advertisement -

ట్రెండింగ్‌లో నాని ‘జెర్సీ’ సాంగ్

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని తాజాగా న‌టించిన చిత్రం జెర్సీ. ఈ సినిమాలో నాని ఓ క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్.”అదేంటోగాని ఉన్నపాటుగా .. అమ్మాయి ముక్కుమీద నేరుగా .. తరాలనాటి కోపమంత ఆ ఎరుపేగా .. నాకంటూ ఒక్కరైనా లేరుగా .. నన్నంటుకున్న తారవే నువ్వా .. నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా ..” అంటూ ఈ పాట సాగుతోంది.

ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకు త్వ‌ర‌లోనే విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నానికి జంట‌గా శ్రద్ధా శ్రీనాథ్ న‌టిస్తోంది.మ‌ళ్లీ రావా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -