నాని ‘జెర్సీ’ టీజ‌ర్‌

452
Nani jersy teaser out now
Nani jersy teaser out now

న్యాచుర‌ల్ స్టార్ నాని వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. దేవ‌దాస్ సినిమాతో హిట్ కొట్టిన నాని ప్ర‌స్తుతం జెర్సీ సినిమాలో న‌టిన్నాడు. గౌతమ్ దర్శకత్వం ఈ సినిమాలో నాని క్రికెట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. గౌతమ్ గ‌తంలో సుమంత్ హీరోగా న‌టించిన మ‌ళ్లీ రావా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసినిమాలో కూడా హ్యుమ‌న్ ట‌చ్ ఉన్న క‌థ‌నే ఈ సినిమాకు ఎంచుకున్నాడ‌ని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

‘నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్.. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్’ అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయ్యే ఈ టీజర్‌తో ఏదో తెలియ‌ని ఎమోషన్‌ని కలిగించాడు నాని.మెయిన్‌గా ‘యు ఆర్ ది లూజర్ ఆఫ్ యువర్ లైఫ్’ అనే డైలాగ్ తో పాటు ‘ఆపేసి ఓడిపోయినవాడున్నాడు కానీ.. ప్రయత్నించి ఓడిపోయిన వాడు లేడు’ అనే డైలాగులు టీజ‌ర్‌లో క‌నిపించాయి. ఇక సినిమా కోసం నాని స్పెషల్‌గా క్రికెట్ కోచింగ్‌కి కూడా వెళ్ళాడట.సినిమాను వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.