Friday, March 29, 2024
- Advertisement -

మెగా ఫ్యాన్స్ దెబ్బ‌కు సినిమా టైటిల్ మార్చేసిన నాని..?

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని త‌న ప్ర‌మేయం లేకుండానే వరుస వివాదాల‌లో ఇరుక్కుంటున్నాడు. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌కు యాంక‌రింగ్ చేయ‌డం ద్వారా లేనిపోని వివాదాల‌ను కొన్ని తెచ్చుకున్నాడు. ఈ షో ద్వారా తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఫేస్ చేశాడు నాని. దీంతో ఇక మీద ఇలాంటి షోస్‌కు యాంక‌రింగ్ చేయ‌న‌ని చెప్పేశాడు. తాజాగా మ‌రో వివాదంలో ఇరుకున్నాడు నాని. నాని కొత్త‌గా న‌టిస్తున్న సినిమాకు టైటిల్‌ను గ్యాంగ్‌లీడ‌ర్‌గా ఫిక్స్ చేశాడు. అయితే ఈ టైటిల్ పెట్టుకోవ‌డంపై మెగాస్టార్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ టైటిల్ పెట్టుకునే అర్హ‌త నీకు లేద‌ని, అది ఒక్క మెగా ఫ్యామిలీకి మాత్ర‌మే ఉంద‌ని మెగాస్టార్ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే సూప‌ర్ హిట్‌గా నిలియింది గ్యాంగ్ లీడ‌ర్‌. ఈ సినిమా టైటిల్‌ను నాని పెట్టుకోవ‌డంతో ఈ వివాదం మొద‌లైంది. మెగా అభిమానులు సినిమా విడుద‌ల స‌మయంలో ట్రోల్ చేస్తార‌నే భ‌యంతో సినిమా టైటిల్‌ను మార్చే ఆలోచ‌న చేస్తున్నాడ‌ట నాని. త్వ‌ర‌లోనే కొత్త సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఈ సినిమా నాని కెరీర్‌లో 24వ సినిమాగా తెర‌కెక్కుతోంది. ఇక ఈ సినిమాకు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాను వ‌చ్చే సమ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -