Friday, April 19, 2024
- Advertisement -

కొత్త సినిమాను మొద‌లుపెట్టిన నాని

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని ఈ మ‌ధ్య కాస్తా స్లో అయ్యాడ‌నే చెప్పాలి. కృష్ణార్జున యుద్దం సినిమా ఫ్లాప్‌తో నానికి పెద్ద దెబ్బ ప‌డింది. ఈ సినిమా ఇచ్చిన షాక్‌తో నాని కోలుకోవాడ‌నికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ఈ సినిమా త‌రువాత దేవదాస్ సినిమాలో న‌టించాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించిన‌ప్ప‌టికి ఆ క్రెడిట్ నాగ్‌కు కూడా వెళ్ల‌డంతో నాని ఏం చేయ‌లేక‌పోయాడు. నాని ప్ర‌స్తుతం జెర్సీ మూవీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి దశ‌కు రావ‌డంతో మ‌రో సినిమాను లైన్లో పెట్టాడు.

నాని ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కూమార్‌తో త‌న త‌రువాత సినిమాను చేయ‌నున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభం అయింది. పూజ అనంతరం నిర్మాతలు పూర్తి బౌండ్ స్క్రిప్ట్ ను విక్రమ్ కుమార్ కి అందజేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా నాని కెరీర్‌లో 24వ సినిమాగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాలో నాని స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తున్నారో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -