Saturday, April 20, 2024
- Advertisement -

గ్యాంగ్ లీడర్ వసూళ్లు: ఆశలు వదిలేసుకోవాల్సిందే

- Advertisement -

ఏ సినిమా కి అయినా మొదటి వీకెండ్ వసూళ్లు చాలా కీలకం. అయితే అవి సినిమా పొటెన్షియల్ ని, ఎన్ని రోజులు ఆడగలదు అనే విషయాన్ని సూచిస్తుంది. ఇక నాని కి సంబంధించి, అతని మార్కెట్ ఉంది, మంచి హీరో, పాజిటివ్ టాక్ తో కూడా సినిమా ని నెట్టుకు రాగలడు.

కానీ తన కొత్త చిత్రం గ్యాంగ్ లీడర్ విషయం లో మాత్రం అలా జరగడం లేదు. ఈ సినిమా యొక్క బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ చాలా విచిత్రం గా ఉంది. సినిమా మీద టాక్ మంచిగా నే ఉన్నప్పటికీ, సినిమా మాత్రం ఆశాజనకం గా ఉన్నట్టు మాత్రం అనిపించడం లేదు. అయితే ట్రేడ్ వర్గాలు ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది అనుకున్నారు కానీ సోమవారం, మంగళవారం ఈ సినిమా వసూళ్లు బాగా పడిపోవటం తో ఇక ఈ సినిమా కోలుకోలేదు అని భావిస్తున్నారు.

విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన సినిమాల్లో ఇది చాలా వీక్ సినిమా అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక శుక్రవారం ఎలాగో వాల్మీకి విడుదల అవుతున్నందున ఈ సినిమా పుంజుకొని అవకాశం అయితే లేదు. ఎంత లేదన్నా గురువారం ఒక్క రోజే ఈ సినిమా మీద ఆశలు పెట్టుకోవాలి కానీ అది కూడా సాధ్యం అయ్యేలా లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -