నాని కి ధీటైన పోటీ కాదిది

261
Nani's Gang Leader Movie drawbacks
Nani's Gang Leader Movie drawbacks

నాని నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరించింది అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమా విషయం లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అభిమానులకి. ఈ సినిమా తో యువ హీరో కార్తికేయ విలన్ గా ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా తో ఆయన పెద్దగా ఏం చేసాడు అనేది అందరి వాదన. చాలా సీన్ల లో అతని నటన పేలవంగా ఉంది అనేది అభిమానుల వాదన.

నాని ఒక పక్క ఇరగదీస్తుంటే, అంతే ధీటుగా సమాధానం ఇవ్వాల్సిన విలన్ మాత్రం సరిగా చేయకపోవడం తో ఆ హీరో విలన్ సన్నివేశాలు అంత బాగా రాలేదు అని అంటున్నారు అందరూ. అయితే కార్తికేయ మాత్రం ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో బాగా కష్టపడినట్టు, మంచి పాత్ర చేసినట్టు చెప్పాడు.

చివరికి క్రిటిక్స్ కూడా సమీక్షలు రాసేప్పుడు కార్తికేయ ఇంకా బాగా చేసుంటే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. సాధారణం గా విక్రమ్ కుమార్ అందరు నటులు బాగా చేయాలి అనే ఆలోచన తో నటుల్ని ఎంపిక చేసుకుంటాడు కానీ ఎందుకో ఈ సారి మాత్రం ప్లాన్ వర్క్ కాలేదు.

Loading...