Friday, April 19, 2024
- Advertisement -

30 న వ‌స్తున్న గ్యాంగ్ లీడర్

- Advertisement -

నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న మూవీ, గ్యాంగ్ లీడర్. ఈ సినిమా ఇప్ప‌టికే కొంతవరకూ షూటింగు పూర్తిచేసుకుంది.ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 30వ తేదీన విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలియచేసారు.

ఈ మూవీలో నాని డిఫరెంట్ ఏజ్ గ్రూపులకు సంబంధించిన అయిదుగురు ఆడవాళ్ళని లీడ్ చేస్తూ వాళ్ళకి గ్యాంగ్ లీడర్‌గా ఉండబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి వినోదభరితంగా .. ఆలోచింపజేసే విధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇటీవల విడుదలైన ‘జెర్సీ’తో హిట్ కొట్టిన నాని, విక్రమ్ కుమార్ తో కలిసి మరో హిట్ కొడతాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -