Thursday, April 25, 2024
- Advertisement -

‘నానీస్ గ్యాంగ్‌ లీడర్’ మూవీ రివ్యూ

- Advertisement -

టైటిల్‌ : ‘నాని గ్యాంగ్‌ లీడర్‌’
నటీనటులు : నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌
సంగీతం : అనిరుధ్‌ రవిచందర్‌
నిర్మాత : మోహన్ చెరుకూరి, రవిశంకర్‌ యలమంచిలి, నవీన్‌ ఎర్నేని
దర్శకత్వం : విక్రమ్‌ కె కుమార్‌

విక్రమ్‌ కె కుమార్‌ తెలుగులో ఇష్క్‌, మనం లాంటి సూపర్‌ హిట్ చిత్రాలను రూపొందించి తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. మన నాచురల్ స్టార్ నాని విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు అనగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోగా సూపర్‌ హిట్ అందుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటంతో ఆ అంచనాలు పెరిగిపొయ్యాయి. నాని సినిమాలకు కామెడీ మంచి ఎలిమెంట్ గా ఆడ్ అవుతుంది, కార్తికేయ ఏంటి విలన్ గా నటిస్తున్నాడు అని అందరి చూపును తన వైపు తిప్పుకున్న సినిమా పరిస్థితి ఏంటి అన్నది చూడాలి.

నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఈ రోజు విడుదల అయింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. రివెంజ్ డ్రామా లాగా వచ్చిన ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరించే విధంగా ఉంటుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా సమీక్ష విషయానికి వస్తే.


కథ:హైదరాబాద్ లో ఒక 300 కోట్ల బ్యాంకు దొంగతనం జరుగుతుంది. దానిని వెతికే పని లో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇదిలా ఉంటె ఒక ముసలావిడ సరస్వతి (లక్ష్మి) ఇంకొంత మంది మహిళల తో కలిసి రివేంజ్ కథలు రాసుకొనే రచయిత పెన్సిల్ (నాని) ని అప్రోచ్ అయ్యి ఆ దొంగతనం గురించి చెప్పి, ఆ దొంగతనం లో చనిపోయింది తమ కుటుంబ సభ్యులు అని చెప్పి, వాళ్లలో ముఖ్యం అయిన వాడిని చంపేస్తాం అని, అందుకు సహాయం కావాలని కోరతారు. అప్పుడు నాని ఏం చేసాడు? నిజంగా నే వాళ్ళకి సహాయం చేశాడా? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథ.


నటీనటులు – వారి పని తీరు:నాని ప్రతి సినిమా తో అందకుండా అంతకంతకూ మించి పోతూ ఉన్నాడు. అయితే ఈ సినిమా తో కూడా నాని తన లో ని నటుడిని పైకి తీసుకొని వచ్చాడు. కావాల్సిన దగ్గరల్లా కామెడీ ని పంచుతూ,ఎమోషనల్ గా ఉంటూ, అదే విధంగా సీరియస్ గా ఉండసాగాడు. అన్ని అంశాలకి ఒక చక్కటి బ్యాలెన్స్ ని నాని తెచుకోగలిగాడు. ఇక హీరోయిన్ ప్రియాంక అందం గా ఉండటమే కాక మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరినీ ఎంతగానో ఆకర్షించింది. నటన కూడా బాగుంది. కొన్ని ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చింది. హీరో కి హీరోయిన్ కి మధ్య సన్నివేశాలు బాగా కుదిరాయి. ఇక లక్ష్మి నటన గురించి చెప్పే పని లేదు. ఆమె మంచి నటన తో పాటు కామెడీ ని కూడా పంచింది. ఇక శరణ్య కూడా తన పరిధి మేరకు మంచిగా నటించి అందరినీ ఎంతగానో మెప్పించింది. నెగటివ్ పాత్ర లో నటించిన దేవ్ కూడా ఈ సినిమా లో చక్కగా సరిపోయాడు. తన నటన కూడా బాగుంది.
సాంకేతిక నిపుణులు – వారి పని తీరు:ఈ సినిమా లో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా యూనిట్ చాలా చక్కగా సినిమా ని తెరకెక్కించారు. ఈ సినిమా లో కెమెరా వర్క్ అద్భుతం గా వచ్చింది. క్రైం బ్యాక్డ్రాప్ ని అందం గా చూపించారు. ఇంకా అనిరుద్ పాటలు మాత్రమే కాకుండా అతని నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ డిసైన్ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పరవాలేదు అని అనిపిస్తుంది. కొన్ని బోరింగ్ సీన్లని కట్ చేయాల్సి ఉంది. ఇంకా సంభాషణలు చక్కగా కుదిరాయి. అంతే కాకుండా ఈ సినిమా లో పాటలు కూడా బాగా వచ్చాయి.
విశ్లేషణ:దర్శకుడు విక్రమ్ కే కుమార్ మంచి కథ ని ఎంచుకొని దానిని అంతే మంచిగా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమా నేరేషన్ స్టైల్ కూడా మంచిగా అనిపిస్తుంది. మంచి కామెడీ తో సినిమా అలరిస్తుంది. అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ కి ఆసకరం లేకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇంకా సెట్టింగ్ కూడా అద్భుతం గా ఉంది. రెగ్యులర్ కమర్షియల్ అంశాల తో నే సినిమా ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్లారు. ఇక ఈ సినిమా లో ఫన్ కి అస్సలు లోటు లేదు. కావలసినంత గా ఇందులో కామెడీ జనాలని అలరిస్తుంది. క్రైం థ్రిల్లర్ గా మంచి డ్రామా ని కామెడీ ని పండేలా చూసుకున్నారు దర్శకులు. ఈ సినిమా లో మంచి కామెడీ ఉండటం పెద్ద ప్లస్  పాయింట్.నాని ఈ సినిమా ని హిట్ వైపుకి నడిపించడం విశేషం.

ప్లస్‌ పాయింట్‌ :
నాని నటన
కార్తికేయ విలనిజం
కామెడీ
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :

విక్రమ్ కె కుమార్ సినిమా అనిపించకపోవడం
స్టోరీ లో కొత్త ఎలిమెంట్స్ ఏం లేకపోవడం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -