Tuesday, April 23, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన నారా రోహిత్..!

- Advertisement -

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. పాత్ర ఏదైన సరై అందులో ఒదిగిపోయి మరి నటిస్తాడు తారక్. అందుకే ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వరస హిట్స్ తో ప్రస్తుతం దూసుకెళ్తున్నాడు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండుగరోజు. అయితే గతేడాది తన పుట్టిన రోజు వేడుకలకు ఎటువంటి హడావిడి చేయవద్దని ఎన్టీఆర్ తన అభిమానులను కోరారు.

తన తండ్రి హరికృష్ణ చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదని.. ఈ విషాద ఘటన నుంచి తాను ఇంకా తేరుకోలేదని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో అప్పుడు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేయలేదు. ఇక ఈ ఏడాది కూడా పరిస్థితులను బట్టి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఎన్టీఆర్. అభిమానులు ఇంట్లోనే ఉంటూ సామాజిక భౌతిక దూరాన్ని పాటించాలని విన్నవించుకున్నాడు. అయితే సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేయడానికి రెడీ అయ్యారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో హీరో నారా రోహిత్.. ఎన్టీఆర్ కోసం స్పెషల్ గిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఇంతకముందు ప్రకటించాడు. నారా వారికి నందమూరి వారికి ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలిసిందే.

అందరి కంటే ముందుగా ఎన్టీఆర్ కు నారా రోహిత్ బర్త్ డే విషెష్ చెప్పేసాడు. తాను చెప్పినట్లుగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసి శుభాకాంక్షలు తెలియజేసాడు. ట్విట్టర్ వేదికగా నారా రోహిత్ స్వయంగా ఎన్టీఆర్ ఫోటో డ్రా చేసి పోస్ట్ చేశాడు. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో ఎన్టీఆర్ షర్ట్ లేకుండా మొండికత్తి పట్టుకొని నిలబడి ఉన్న ఫోజ్ ను స్కెచ్ రూపంలో బహుమతిగా అందించాడు నారా వారి అబ్బాయి రోహిత్. తనలో ఉన్న టాలెంట్ ను బయటకు తీశాడు. ఈ సందర్బంగా నారా రోహిత్..”ఎవరో చెప్పినట్లు మాటలలో ఎక్సప్రెస్ చేయలేని విషయాలు కొన్ని ఆర్ట్ ద్వారా చెప్పవచ్చు. కాబట్టి తారక్ మీకు మీ ఫ్యాన్స్ కి ఒక చిన్న బహుమతి. హ్యాపీ బర్త్ డే తారక్” అంటూ ట్వీట్ చేసాడు. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Nara Hero Birthday gift to Nandamuri's Hero

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -