Friday, April 19, 2024
- Advertisement -

వైసీపీలోకి ఎన్టీఆర్ మామ‌

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది పార్టీలు మారే నేత‌లు ఎక్కువైయ్యారు. ఇప్ప‌టికే ఏపీ అధికార టీడీపీ పార్టీ నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీలోకి భారీ ఎత్తున వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఎంపీ, ఎమ్మెల్యేల‌లు వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో వ్య‌క్తి వైసీపీ తీర్థం పుచ్చుకోవాడనికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మామ అయిన (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నె శ్రీనివాసరావు వైసీపీ అధినేత జగన్‌ను సోమ‌వారం లోట‌స్‌పాండ్‌లో క‌లవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

వీరిద్ద‌రు భేటీ దాదాపు గంట వ‌ర‌కు సాగింది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయ‌ల‌పై జ‌గ‌న్‌తో చ‌ర్చించారు నార్నె శ్రీనివాసరావు. దీంతో మీడియాలో ఆయ‌న వైసీపీలో చేర‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే త‌మ భేటీపై ఎలాంటి రాజ‌కీయ ప్రాధన్య‌త లేద‌ని నార్నె శ్రీనివాసరావు తెలిపారు.కేవలం మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలిశానని చెప్పారు. జగన్‌తో తనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీనిలో భాగంగానే ఆయ‌న‌ను క‌లిశాన‌ని తెలిపారు నార్నె. వైసీపీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్న తరుణంలో వీర‌ద్ద‌రి భేటీ ప్రాధ‌న్య‌త‌ను సంత‌రించుకుంది.

2014 ఎన్నిక‌ల‌లో నార్నె శ్రీనివాసరావు వైసీపీ టికెట్ ఆశించారు. టికెట్ త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆయ‌న సైలెంట్ అయ్యారు. మ‌ళ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఆయ‌న జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ అయిన నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేర‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి పిల్ల‌ను ఇచ్చిన మామ వైసీపీలోకి వెళ్తే ఎన్టీఆర్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -