Thursday, March 28, 2024
- Advertisement -

రాజశేఖర్ కూతురు తో రొమాన్స్ చేయబోతున్న నాని

- Advertisement -

రాజశేఖర్ జీవితాల కూతురు రు శివాత్మిక రాజశేఖర్ త్వరలో ‘దొరసాని’ అనే సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న శివాత్మిక రాజశేఖర్ తనకు న్యాచురల్ స్టార్ నాని నటన అంటే చాలా ఇష్టమని చెప్పింది. అయితే తాజా సమాచారం ప్రకారం శివాత్మిక త్వరలో నాని సరసన హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

జీవిత ఈ మధ్యనే నాని మరియు శివాత్మిక హీరోహీరోయిన్లుగా సూటయ్యే ఒక కథ రాసుకున్నారట. అయితే ఆమె ఇంకా నానికి కథను వినిపించాల్సి ఉంది. ఒకవేళ నానికి కథ నచ్చితే జీవిత స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. అయితే ‘దొరసాని’ సినిమా విడుదలయ్యే వరకు ఆగి ఆ తరువాత తదుపరి సినిమా గురించి ఆలోచించవచ్చని జీవిత నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం నాని కూడా ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నీ కుదిరితే శివాత్మిక త్వరలోనే తన అభిమాన నటుడితో కలిసి నటించిన నటించవచ్చు అన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -