Friday, April 26, 2024
- Advertisement -

ప్రేమ వల్ల జీవితంలో సమస్యలు – నయనతార

- Advertisement -

తెలుగుతో పాటు తమిళంలో వరస ఆఫర్స్ తో దూసుకెళ్తుంది అందాల తార నయనతార. ఈ భామ సినిమా కంటే ఎక్కవగా ప్రేమల వల్లే పబ్లిసిటీ దక్కించుకుంది. అయితే ఈ భామకు తెలుగులో కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలుగులో నటించిన  ‘బాబు బంగారం’ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక తమిళ మీడియాతో మాట్లాడుతూ తన ప్రేమ వ్యవహారాల గురించి చెప్పుకొచ్చింది. ప్రేమ వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఒకానొక టైంలో లవ్ కోసం సినిమాలు చేయోద్దు అని అనుకున్నాను. లవ్ గురించి మర్చి పోయేందుకు సినిమాలే దిక్కు అయ్యాయి. గత జ్ఞాపకాలను మర్చి పోయేందుకే తాను వరుస సినిమాలను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

శింబుతో ప్రేమలో ఉన్నప్పుడు చాలా ఒత్తిడి ఫీల్‌ అయ్యాను, ఆయన ప్రతి విషయంలో ఇబ్బంది పెట్టేవాడు అని చెప్పుకొచ్చింది. ఇక ప్రభుదేవాతో లవ్ గురించి ఈమె స్పందించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం ప్రేమకు తన జీవితంలో ప్లేస్ లేదు అని, దాన్ని గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదు అని ఈమె పేర్కొంది. ఇంటర్వ్యూ సమయంలో ఆమె కంట కన్నీరు కూడా పెట్టుకుంది.

Related

  1. నయనతార రేటు ఎంతంటే?
  2. నయనతార అందాలు చూస్తే షాక్ కావాల్సిందే!
  3. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?
  4. నయనతార అతన్ని వదల్లేదు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -