Thursday, April 25, 2024
- Advertisement -

నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి డేట్ ఫిక్స్..!

- Advertisement -

ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు. వీరు గత ఐదేళ్ళుగా డేటింగ్ చేస్తున్న పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరి సహజీవనం వదిలేసి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టేందుకు ఇప్పుడు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

శింబు, ప్రభుదేవాతో బ్రేకప్స్ జరిగిన కొంత కాలం సింగిల్ గా ఉన్న నయనతార నానమ్ రౌడీ ధాన్ షూటింగ్‌లో విఘ్నేష్ శివన్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇక తాజాగా మదర్స్ డే రోజున విఘ్నేష్ శివన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ ఫోటోను ట్వీట్ చేస్తూ ఈ పిల్లలకు తల్లిగా కనిపిస్తున్న ఆమెనే భవిష్యత్‌లో నా పిల్లలకు తల్లి అంటూ విఘ్నేష్ గమ్మత్తైన ట్వీట్ చేసి నయనతారతో తన బంధానికి మరోసారి క్లారిటీ ఇచ్చారు.

లాక్ డౌన్ ముందే నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని.. కానీ అనుకోకుండా లాక్ డౌన్ రావడంతో పెళ్లి వాయిదా పడిందిని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే కరోనావైరస్ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే పెళ్లికి మరో ముహుర్తాన్ని పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక విఘ్నేష్ శివన్, నయనతార కెరీర్ విషయానికి వస్తే.. త్వరలోనే కతు వాకులా రెండు కాదల్ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ నిర్మాత కావడం గమనార్మం. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంత కూడా నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -