Friday, March 29, 2024
- Advertisement -

బన్నీ ఖాతాలో మరో హిందీ రికార్డ్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి హిందీ లో ఎంత పెద్ద మార్కెట్ ఉంది అనే విషయం మనకి తెలిసిందే. తన ప్రతీ సినిమా ని హిందీ లో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తారు. ఎప్పుడెప్పుడు బన్నీ సినిమా విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్య నే బన్నీ సినిమా సరైనోడు యూట్యూబ్ లో ఒక కొత్త రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఈ లోపే ఇంకో బన్నీ సినిమా ఇంకో కొత్త రికార్డ్ సృష్టించింది.

హిందీ లో విడుదల అయిన దువ్వాడ జగన్నాథం సినిమా ఇప్పటికే 150 మిలియన్ వ్యూస్ దాటేసింది. అయితే అది కూడా రెండో సారి అప్లోడ్ చేసిన తక్కువ సమయం లో ఇది జరిగింది. అంతే కాకుండా ఈ సినిమా వీడియో కి 480000 లైక్స్ కూడా వచ్చాయి. ఇది చూస్తే బన్నీ కి హిందీ లో ఎంత క్రేజ్ ఉంది అనే విషయం అర్ధం చేసుకోవచ్చు.

అయితే బన్నీ అభిమానులు ఈ మైలురాయి ని సెలెబ్రేట్ చేసుకోవడానికి #Massive150MviewsforDJHINDi అనే హాష్ టాగ్ తో ట్వీట్స్ వేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -