Thursday, April 25, 2024
- Advertisement -

సాహో ముందు ఉన్న కొత్త టార్గెట్ అదే

- Advertisement -

ప్రభాస్ నటించిన సినిమా సాహో ప్రస్తుతం అందరి దృష్టి ని ఆకర్షిస్తూ మంచి వసూళ్ళని రాబడుతుంది. ఈ సినిమా మొదట్లో కొంచెం తక్కువ వసూలు చేసినా కానీ మెల్లగా ఈ సినిమా కి సంబందించిన వసూళ్లు పెరిగాయి కానీ అంతలో నే మళ్ళీ తగ్గాయి కూడా. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి మాత్రమే.

హిందీ లో ఈ సినిమా వసూళ్ల పరంపర కి అసలు అడ్డూ ఆపూ లేకుండా పోతుంది అనేది వాస్తవం. ఇప్పటికే ఈ సినిమా ని హిందీ లో హిట్ గా డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా హిందీ లో ప్రభాస్ కి మంచి మార్కెట్ ఏర్పడింది, తన స్టార్డం కూడా పెరిగింది అని చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం 424 కోట్ల కి పైగా గ్రాస్ ని వసూలు చేసింది అని సమాచారం. ఇకపోతే ఈ సినెమా పలు హిందీ సినిమాల కి సంబందించిన వసూళ్ల ని కూడా దాటుకొని ముందుకు వెళ్తున్న తరుణం లో కొంత మంది ఈ సినిమా ఐదు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

అయితే నిజానికి ఎంత వసూలు చేస్తుంది అనే దాని పైన ఒక క్లారిటీ లేదు కానీ 500 కోట్లు సాధిస్తే మాత్రం కచ్చితం గా ఒక రికార్డ్ గా ఉండిపోతుంది. మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -