పవన్ సినిమా కి సరికొత్త టైటిల్..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుపుతుండగా ఈ సినిమా తర్వాత వచ్చే పవన్ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందే పవన్ 27వ చిత్రం మొదలవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.ఇక ఈ చిత్రం టైటిల్ పై అప్పుడే సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఫలానా టైటిల్ని ఫిక్స్ చేశారంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కొందరేమో ఆయా టైటిల్స్ తో చక్కగా లోగోలు కూడా డిజైన్ చేసి వదులుతున్నారు. అయితే, ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఏదీ ఖరారు కాలేదని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ‘విరూపాక్ష’, ‘గజదొంగ’, ‘బందిపోటు’, ‘ఓం శివమ్’ వంటి పేర్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో ఉన్నప్పటికీ, ‘విరూపాక్ష’, ‘ఓం శివమ్’ అనే పేర్లను మాత్రమే చిత్రం యూనిట్ సీరియస్ గా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఈ రెండింటిలోను ఒక దానిని ఫైనల్ చేసే అవకాశం వుంది.

- Advertisement -

ఈ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వ కాలం నాటి కథతో పిరీడ్ మూవీగా రూపొందుతోందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. దీంతో వీఎఫ్ఎక్స్ పనులకు కూడా చాలా ప్రాధాన్యత వుందట. అందుకే, ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు బెన్ లాక్ ను తీసుకున్నట్టు చెబుతున్నారు. నార్త్ లో కూడా పవన్ కి మంచి మార్కెట్ వుండడం వల్ల ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు!

Most Popular

Related Articles

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిం కేసీఆర్‌, ప‌వ‌న్ భేటీ…

తెలంగాణ సిఎం కేసిఆర్ తో పిల్మ్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లోని కేసిఆర్ నివాస గృహంలో వీరి సమావేశం జరిగింది. ఇది ప్రస్తుతం హాట్...

జ‌గ‌న్‌కు బాబు షాక్ ఇస్తుంటె… బాబుకే షాక్ ఇస్తున్న తెలుగు త‌మ్ముళ్లు..

పార్టీ ఫిరాయింపుల‌ను బాబు ప్రోత్స‌హిస్తుంటె....సొంత పార్టీలో మాత్రం తెలుగు త‌మ్ముళ్లు బాబు షాక్ ఇవ్వ‌బోతున్నారు. ఆ పార్టీని వీడేందుకు మ‌రో నేత సిద్ధ‌మ‌య్యార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనె జ‌న‌సేన పార్టీలోకి...

జ‌న‌సే యాక్స‌న్ ప్లాన్ రెడీ…..

సోషియ‌ల్ మీడియాకే ప‌వ‌న్ క‌ళ్యాన్‌ప‌రిమిత మ‌య్యార‌ని వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై స్పందించారు. ఇక‌నుంచి ఎక్కువ‌గా రాజ‌కీయాల‌పైనె దృష్టి పెట్ట‌నున్నాని వెల్ల‌డించారు. అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప‌వ‌న్‌ చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...