హీరో నిఖిల్ పెళ్లి అయిపోయింది.. ఎలా అంటే ?

481
Nikhil Kumaraswamy Wedding in Simple Manner Due to CoronaVirus Outbreak
Nikhil Kumaraswamy Wedding in Simple Manner Due to CoronaVirus Outbreak

మాజీ ప్రధాని మనవడు.. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్గజ నేత కుమారుడు పెళ్లి లాక్ డౌన్ కారణంగా సింపుల్ గా అయిపోయింది. అయితే కన్నడ నాట వివాహం అంటే అదిరిపోయే రెంజ్ లో చేస్తారు. కానీ ఈ మాజీ సీఎం కుమారుడు పెళ్లి సాదాసీదాగా ఫాంహౌస్ లో ముగియడం గమనార్హం.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు హీరో నిఖిల్ గౌడ పెళ్లి శుక్రవారం ఉదయం ఫామ్ హౌస్ లో చాలా సింపుల్ గా జరిగింది. తెలుగు హీరోలు నితిన్, నిఖిల్ లు లాక్ డౌన్ కరోనాతో పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. చాలామంది అలానే చేశారు. కానీ కన్నడ హీరో నిఖిల్ గౌడ మాత్రం ససేమిరా అన్నారు. రేవతిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. కరోనా కారణంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అతి కొద్ది మంది సమక్షంలో రేవతి మెడలో మూడు ముళ్లు వేశాడు నిఖిల్.

నిశ్చిత్తార్థం వేడుక అంగరంగ వైభవంగా జరగగా.. పెళ్లిని కూడా అదిరిపోయేలా ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల పెళ్లిని వాయిదా వేయడం కంటే సింపుల్ గా చేయడం బేటర్ అని ఇలా బెంగళూరులోని ఫాంహౌస్ లో ఉదయం 7.30గంటలకు వివాహాన్ని సాదాసీదాగా చేశారు. ఇక నిఖిల్ జాగ్వార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మొన్నటి ఎన్నికల్లో నిఖిల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. హీరోగా – జేడీఎస్ రాజకీయ నాయకుడిగా నిఖిల్ కొనసాగుతున్నాడు.

Loading...