Saturday, April 20, 2024
- Advertisement -

మంచు లక్ష్మీ పిలిస్తే వెళ్లాల్సిందే : హీరో నిఖిల్

- Advertisement -

ఇండస్ట్రీలో యువ హీరోలకు, హీరోయిన్లకు మంచు లక్ష్మీ ఎంత చెబితే అంతే. అందరితో కలిసి సరదాగా ఉండే లక్ష్మీ అంటే అందరికీ ఇష్టమే. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో మంచి సంబంధాలను మెయింటెన్ చేస్తూ ఉంటుంది. ప్రేమతో మీ లక్ష్మీ వంటి షోలతో సెలబ్రిటీల మనస్సులో మాటలను ప్రేక్షకులకు చూపించింది. మేముసైతంతో ఎంతో మందికి సహయపడింది.

చాలా మంది సెలబ్రిటీలతో సాయం చేయించింది. ఇలా తన ప్రత్యేకతను చాటుకుంటూ.. నటిగా.. నిర్మాతగా మంచి పేరు సంపాధించుకుంది. మారిన కాలం ప్రకారం మంచు లక్ష్మీ కూడా తన పంతా మార్చి కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెలబ్రిటీల బెడ్రూమ్ ముచ్చట్లు అభిమానుల ముందు పెట్టేస్తోంది. ఈ షోలో ఇప్పటివరకు సమంత, రకుల్, శ్రుతీ హాసన్, వరుణ్ తేజ్ వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఎవరికి తెలియని చాలా విషయాలను మంచు లక్ష్మీతో కలిసి బయటపెట్టారు. ఇక తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకుని కొత్తరకం సినిమాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు హీరో నిఖిల్. ఈ మధ్య తన సినిమా ఒక్కటి రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల చేత అది వాయిదా పడుతూ వస్తోంది. ఇక తాజాగా మంచు లక్ష్మీ షోలో నిఖిల్ పాల్గొని ఎన్నో సీక్రెట్స్ ను చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో మంచు లక్ష్మీ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. మంచు లక్ష్మీ గురించి మాట్లాడుతూ.. ఆమె పిలిస్తే మా యంగ్ హీరోల్లో ఎవరైన వెళ్లాల్సిందే. లేకుంటే కైమా కొట్టేస్తుందని ఫన్నీగా చెప్పాడు. తర్వాత మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. నైట్ డ్రెస్ వేసుకుని ఈ షోకి నిఖిల్ ను రమ్మన్నాను అని చెప్పుకొచ్చింది. ఇక ఈ షోలో నిఖిల్ తన లవ్ మ్యాటర్ ను బయటపెట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -