Thursday, April 25, 2024
- Advertisement -

పాపం నిఖిల్ అంటున్న ఇండస్ట్రీ వర్గాలు

- Advertisement -

యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ్ కి తెలుగు సినిమా పరిశ్రమ లో నటుడిగా మంచి పేరుంది. హ్యాపీ డేస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఆ తర్వాత విజయవంతమైన సినిమాల లో నటించాడు కానీ అవేమి తనకి పెద్దగా ఉపయోగపడలేదు. వరుస పరాజయాలు వస్తున్నా కుంగిపోకుండా ప్రయత్నం చేసాడు కాబట్టే ఇప్పుడు ఇండస్ట్రీ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు నిఖిల్. స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాల తో నిఖిల్ తనకి తిరుగు లేదు అని ప్రూవ్ చేసుకున్నాడు.

ఈ రోజు ఈ యువ హీరో పుట్టిన రోజు. పుట్టిన రోజు నాడు ఎవరైనా మంచి సంతోషం గా ఉంటారు కానీ ఎందుకో నిఖిల్ మాత్రం చాలా అనిశ్చితి తో ఉన్నాడు. దీనికి ఒకటే కారణం. నిఖిల్ కొత్త చిత్రం అర్జున్ సురవరం విడుదల తేదీ పై న నెలకొన్న సందిగ్ధత ఇప్పటికి కూడా పూర్తి కాకపోవడమే. అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని ప్రమోషన్స్ చేశారు కానీ విడుదల తేదీ దగ్గర పడే సమయానికి సినిమాని పలు మార్లు వాయిదా వేశారు.

సినిమా ఇప్పటికే విడుదల అయి ఉంటె, విజయాన్ని కూడా కలుపుకుని పుట్టిన రోజు జరుపుకుందాం అనుకున్న నిఖిల్ కి ఈ ఏడాది మాత్రం ఇది ఒక నిరాశ గా మిగిలిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -