Friday, April 19, 2024
- Advertisement -

గ్యాంగ్ లీడర్ నుంచి సిద్ శ్రీరామ్ పాట

- Advertisement -

‘జెర్సీ’ సినిమా తో అందరినీ కంటతడి పెట్టిన నాచురల్ స్టార్ నాని ఇప్పుడు తన తదుపరి సినిమా ‘గ్యాంగ్ లీడర్’ తో అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తే సినిమా ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తోంది. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో నాని తో రొమాన్స్ చేస్తుండగా సీనియర్ నటీమణులు లక్ష్మీ మరియు శరణ్య పొంవణ్ణన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమా కథ మొత్తం పార్థసారధి పాత్రలో నాని మరియు ఐదుగురు ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తాజాగా సినిమా నుంచి ‘నిన్ను చూసే ఆనందంలో’ అనే పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అనిరుధ్ రవిచందర్ ‘జెర్సీ’ సినిమాకే కాకుండా ఈ సినిమాకి కూడా మంచి ట్యూన్స్ ని అందించారని ఈ పాట వింటే అర్థం అవుతుంది. సిద్ శ్రీరామ్ గాత్రం కూడా పాట కి ఎంతగానో ఉపయోగపడింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మంచి అంచనాల మధ్య ‘గ్యాంగ్ లీడర్’ సినిమా సెప్టెంబర్ 13 న విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -