Tuesday, March 19, 2024
- Advertisement -

నితిన్‌ కాబోయే భార్య ఫ్యామిలీకి చిరంజీవికి లింక్ ఏంటో తెలుసా ?

- Advertisement -

యంగ్ హీరో నితిన్, షాలిని రెడ్డి ఎంగెజ్మెంట్ ఇటీవలే జరిగింది. వీరి వివాహ వేడుక ఏప్రిల్ 16న దుబాయ్‌లో కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో బంధుమిత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. నితిన్‌ది లవ్ మ్యారేజ్. షాలినితో నితిన్ కు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉంది.

ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అందుకే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. షాలిని రెడ్డి కందుకూరి తెలంగాణలోని నాగర్ కర్నూల్ అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్. నాగర్ కర్నూలులో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఇప్పుడు తమ రెండో కుమార్తె షాలినికి కూడా ప్రేమ వివాహమే చేస్తున్నారు. డాక్టర్ నూర్జహాన్‌కు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. అది రాజకీయపరంగా.

2008లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు నూర్జహాన్ పార్టీలో చేరారు. అంతేకాదు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం సీటును నూర్జహాన్‌కు ఇచ్చారు చిరంజీవి. కానీ ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. తర్వాత ప్రజారాజ్యం పార్టీ పని కూడా అయిపోయింది. ఇక నూర్జహాన్ కూడా రాజకీయాలకు దూరంగా ఉంది. నితిన్, షాలిని పెళ్లితో మళ్లీ ఇప్పుడు ఆమె వార్తల్లోకి వచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -