ఘనంగా నితిన్, శాలిని పెళ్లి..!

1084
nithin shalini wedding taj falaknuma palace
nithin shalini wedding taj falaknuma palace

ఎట్టకేలకి టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి అయింది. హైదరాబాద్లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జులై 26 ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్–శాలిని ల వివాహం కరోనా నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది ఆత్మీయులు సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. ఈ వివాహంకు నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హీరో కార్తికేయ హాజరైయ్యారు.

అలానే రాజకీయ ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి తర్వాత శాలిని మెడలో తాళి కడుతున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసిన నితిన్.. “మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి’ అని కోరాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి పనులు ప్రారంభించిన నితిన్ లాక్ డౌన్ కారణంగా వివహ వేడుకను వాయిదా వేస్తూ వచ్చాడు. అయితే ఇప్పట్లో పరిస్థితులు చక్కబడేలా లేవు కాబట్టి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆదివారం రాత్రి పెళ్లి శాలిని మెడలో మూడు ముళ్లు వేశాడు నితిన్.

ఇక నితిన్ సినిమా విషయంకు వస్తే.. నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి ఫేం కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్ పెళ్లి సందర్భంగా ‘ఏ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ టు అవర్ హీరో’ అంటూ రంగ్ దే టీమ్ టీజర్ ని విడుదల చేసింది. 2021 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పరన్నజీవి మూవీ రివ్యూ..!

‘పవర్ స్టార్’ మూవీ రివ్యూ

ముద్దులతో హీరోయిన్ ను వదిలని ‘డర్టీ హరి’..!

తన సీమంతం పోటోలను షేర్ చేసిన రమ్యకృష్ణ..!

Loading...