మల్లు హీరోయిన్ ను రంగం లోకి దింపుతున్న త్రివిక్రమ్.

234
Nivetha Thomas For Allu Arjun's Next
Nivetha Thomas For Allu Arjun's Next

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్ర లో త్వరలో రాబోతున్న ఒక కొత్త సినిమా కి సంబంధించిన షూటింగ్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా లో పూజ హెగ్డే మొదటి హీరోయిన్ గా కేతిక శర్మ రెండవ హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ప్రస్తుతం మీడియా లో తిరుగుతున్న వార్త ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సరసన జై లవ కుశ లో ఒక ముఖ్య పాత్ర పోషించిన నివేత థామస్ ఈ సినిమా లో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేయనున్నది అట.

S/O సత్యమూర్తి సినిమా లో నిత్య మీనన్ పాత్ర కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ సినిమా లో నివేతా థామస్ కి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కి సంబంధించిన సన్నిహిత వర్గాలు మాత్రం ఇప్పటి వరకు నివేతా థామస్ ని అప్రోచ్ అవ్వలేదు అని అసలు అలాంటి ప్రపోజల్ సినిమా యూనిట్ ఎప్పుడు ఆలోచించలేదు అని చెప్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ త్వరలో మూడో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. మరి కొద్ది రోజులు ముగిస్తే కానీ ఈ సినిమా కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మనకి తెలియవు.

Loading...