Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రభాస్ పెళ్లి పై ఇంకా నో క్లారిటీ

- Advertisement -

కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే ప్రశ్న దాదాపు రెండేళ్ల పాటు యావత్ భారతదేశాన్ని నిద్రలేకుండా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్న గురించి అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలంగా ప్రభాస్ పెళ్లి గురించి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు వెలువడలేదు. గతంలో బాహుబలి దేవసేన పాత్రలలో కనిపించిన ప్రభాస్ అనుష్కల మధ్య ప్రేమాయణం సాగుతుందని వారిద్దరూ త్వరలోనే పెళ్లి పీఠలు కూడా ఎక్కనున్నారని వార్తలు వినిపించాయి.

కానీ ఆ సమయంలోనే వారిద్దరూ ఆ పుకార్లను కొట్టిపారేసిసారు. ఈ మధ్యనే ప్రభాస్ ఒక బిజినెస్ మాన్ కూతురు ని పెళ్లిచేసుకోబోతున్నట్లుగా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ పుకార్లకు సైతం ఫుల్స్టాప్ పెట్టేశాడు ప్రభాస్. మరి ప్రభాస్ కాబోయే భార్య ఎక్కడుందో ఏం చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న ప్రభాస్ తన పెళ్లి గురించి మాత్రం మాట ఎత్తడం లేదు. ఇక ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ రావాలంటే మాత్రం మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. మరో వైపు ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమా ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -