Friday, March 29, 2024
- Advertisement -

సూర్య ‘బందోబస్తు’ కి తీరని కష్టాలు

- Advertisement -

సూర్య హీరోగా నటించిన ‘బందోబస్తు’ (తమిళంలో కాప్పన్) సినిమా ఆగస్టు 30న విడుదల కావాల్సింది. కానీ ‘సాహో’ సినిమా కూడా అదే రోజు విడుదల అవుతుండటంతో ‘బందోబస్తు’ సినిమా సెప్టెంబర్ 20 కి వాయిదా పడింది. తమిళ సినిమా సంగతి పక్కన పెడితే సూర్య ఇప్పుడు అదే సినిమాని తెలుగులో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ‘గజినీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కి డబ్బింగ్ సినిమాలతో ఎంటరైన సూర్య టాలీవుడ్ లో కూడా మంచి స్టార్డమ్ సంపాదించాడు కానీ ‘సికిందర్’ వంటి సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సూర్య మార్కెట్ కూడా బాగా పడిపోయింది.

పైగా మొన్నీ మధ్యనే విడుదలైన సూర్య ‘ఎన్ జి కే’ సినిమా తమిళంలోనే ఫ్లాప్ అంటే తెలుగులో ఇంకా పెద్ద డిజాస్టర్ గా మారింది. కాబట్టి సూర్య ‘బందోబస్తు’ సినిమాలపై అంచనాలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో నిర్మాతలు సినిమా అని అతి తక్కువ రేట్లకు డిస్కౌంట్లు ఇచ్చి మరీ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు మోహన్ లాల్ వంటి పెద్ద నటుడు ఉన్నప్పటికీ మరియు దర్శకుడు కె.వి.ఆనంద్ ఇంతకుముందు ‘బ్రదర్స్’, ‘వీడొక్కడే’ వంటి హిట్ సినిమాలు తీసినప్పటికీ వారిద్దరి ఇమేజ్ కూడా సినిమా రేట్లను పెంచకపోవడం బాధాకరం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -