Friday, April 26, 2024
- Advertisement -

ఇంకా పెద్ద సినిమాల షూటింగ్ లు ఎందుకు మొదలవలేదు..?

- Advertisement -

కరోనా వల్ల దేశంలో అన్ని ఆగిపోయినట్లే షూటింగ్ లు ఆగిపోయాయి. దాంతో ప్రజల వినోద కార్యక్రమాలు, సినిమా లు ఆగిపోయాయి. దాదాపు నాలుగు నెలలు ప్రజలు ఫ్రెష్ సినిమాలకు దూరం గా ఉంటున్నారు.. OTT లో సినిమా లు వస్తున్నా అవి అప్పటికే షూటింగ్ అయిపోయిన సినిమాలు. ఇక తాజాగా ప్రభుత్వం కరోనా సడలింపు లలో భాగంగా  సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చింది.. ఇచ్చి చాలా రోజులే అవుతుంది.. అయినా ఇప్పటివరకు స్టార్ హీరో లు ఎవ్వరు షూటింగ్ కి వెళ్ళడం కాదు కదా షూటింగ్  గురించి ఆలోచించడం కూడా లేదట..

చిరంజీవ ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప, విజయ్ దేవరకొండ పూరి సినిమా, మహేష్ బాబు సర్కార్ వారి పాట, బాలకృష్ణ బోయపాటి సినిమా, రామ్ చరణ్ ఎన్టీఆర్ ల RRR లాంటి క్రాయ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నా ఆ హీరోలు ఎవరు ఇంకా షూటింగ్ లకి బయల్దేరలేదట.. తాజాగా కేసులు పెరుగుతుండటంతో టాలీవుడ్ స్టార్ హీరోలు మళ్లీ మేకప్ వేసుకునేందుకు రెడీగా లేమని అంటున్నారట హీరోలు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ససేమీరా అంటున్నాడట..  వకీల్ సాబ్ షూటింగ్ మరికొంత భాగంతో పూర్తి కానుండగా..

తాజా పరిణామాల నేపథ్యంలో జనవరిలోనే సెట్స్ లోనే జాయిన్ కావాలని పవన్ ఆలోచిస్తున్నాడట. మరోవైపు రాంచరణ్‌, చిరంజీవి, ప్రభాస్ కూడా ఇప్పటివరకు షూటింగ్ లో పాల్గొనలేని పరిస్థితులున్నాయి. చిరంజీవి నవంబర్ లో కేసులు పరిస్థితిని బట్టి షూటింగ్ లో పాల్గొలనుకుంటున్నాడని టాక్‌. ప్రభాస్ కు వీసా క్లియరెన్స్ వచ్చిన తర్వాత రాధేశ్యామ్ షూట్ కోసం యూరప్ దేశాలకు వెళ్లనున్నాడు. మొత్తానికి కరోనా మహమ్మారి ధాటికి స్టార్ హీరోలెవ్వరూ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొందని స్పష్టమవుతుంది. ఇండస్ట్రీలో మిగిలిన హీరోల పరిస్థితి దాదాపు ఇలానే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -