రాజ‌మౌళితో మ‌హేశ్ బాబు సినిమా చేయ‌డం క‌ష్ట‌మే..?

1110
Not workout in Mahesh babu and rajamouli combination
Not workout in Mahesh babu and rajamouli combination

టైటిల్ చేసి క‌న్‌ఫ్యూజ్ కాకండి. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇద్ద‌రు సినిమా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు కూడా. రాజ‌మౌళి మ‌హేశ్‌కు ఓ లైన్ కూడా వినిపించ‌డ‌ని, ఆ స్టోరీకి మ‌హేశ్‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్త‌లు వచ్చాయి. అయితే మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలియ‌దు కాని ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీగా మారారు. రాజ‌మౌళి బాహుబ‌లితో నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇప్పుడు రాజ‌మౌళి అంటే ఒక్క తెలుగు ఇండ‌స్ట్రీనే కాదు , యావ‌త్తు ఇండియా మొత్తం ఆయ‌న సినిమాల కోసం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి. అయితే రాజమౌళి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు పెట్టి ఆర్ఆర్ఆర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈసినిమాలో ఎన్టీఆర్ కోమ‌ర‌మ్ భీమ్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామారాజు పాత్ర‌లో క‌నిపించున్నాడు. అయితే అల్లూరి సీత‌రామారాజు పాత్ర‌కు మ‌హేశ్‌ను తీసుకుని ఉంటే సినిమాకు మరింత హైప్ వ‌చ్చేద‌ని సినీ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే మ‌హేశ్ తండ్రి కృష్ణ గారు అల్లూరి సీత‌రామారాజు జీవితాన్ని వెండితెర మీద చూపించి సూప‌ర్ హిట్ కొట్టారు. తెలుగువారికి అల్లూరి సీత‌రామారాజు అంటే కృష్ణ‌నే గుర్తుకు వ‌స్తాడు.

మ‌రి కృష్ణ‌ను కొడుకుని కాద‌ని రామ్ చ‌ర‌ణ్‌ను పెట్టాడు రాజ‌మౌళి. అయితే మ‌హేశ్ కోసం తాను సిద్దం చేసిన క‌థ వేరే క‌నుక ఇందులో రామ్ చ‌ర‌ణ్‌ను తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. మ‌హేశ్ బాబు కోసం రాజమౌళి ఓ జేమ్స్‌బాండ్ క‌థ‌ను సిద్ధం చేశాడ‌ని టాక్‌. అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అటు రాజ‌మౌళి, ఇటు మ‌హేశ్ బాబు ఇద్ద‌రు కూడా బిజీగా ఉన్నారు. వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేసి విడుద‌ల కావలంటే క‌నీసం మూడు నుంచి నాలుగు సంవ‌త్స‌రాలు అయిన ప‌డుతోంది. మ‌రి ఈ కాంబినేష‌న్‌లో కోసం ఎవ‌రో వెయిట్ చేస్తారో చూడాలి.