Friday, March 29, 2024
- Advertisement -

త‌న పాత్ర‌పై రానాకు సూచ‌న‌లు ఇస్తున్న చంద్ర‌బాబు?

- Advertisement -

సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను ‘ఎన్టీఆర్’ పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్న అంద‌రికి తెలిసింది.ఈ సినిమాను ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ న‌టించి,నిర్మిస్తున్నారు.ప్ర‌స్తుతం ఈ సినిమాలోని న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతుంది.ఎన్టీఆర్ భార్యగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్ న‌టిస్తుంది.తాజాగా ఈ సినిమాలోకి వ‌చ్చి చేరాడు రానా.ఈ సినిమాలో రానా ఎన్టీఆర్ అల్లుడు,ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడి పాత్ర‌ను పోషిస్తున్నార‌నే వార్త‌లు విన‌బ‌డుతున్నాయి.

ఈ విష‌యంలో చంద్రబాబు ద‌గ్గ‌ర సూచ‌న‌లు తీసుకోవ‌డానికి వెళ్లాడు రానా. ఎన్టీఆర్ జీవిత క‌థ అంటే చంద్ర‌బాబు గురించి ప్ర‌స్తావ‌న త‌ప్ప‌కుండా ఉండాలి.అయితే అది మంచిగానే చూపిస్తార‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించి సీఎం కూర్చీపై కూర్చున్నాడు చంద్ర‌బాబు.మ‌రి సినిమాలో ఈ సంఘ‌ట‌న‌ను చూపిస్తారో లేదో చూడాలి.చంద్ర‌బాబుని క‌లిసిన వారిలో బాల‌కృష్ణ‌తో పాటు చిత్ర ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా ఉన్నారు.త‌న పాత్ర ఎలా ఉండాలో బాబు ముందే చెప్పాడ‌ని తెలుస్తుంది.దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -