Saturday, April 20, 2024
- Advertisement -

వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్న ఎన్టీఆర్‌?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.ప్ర‌స్తుతం న‌డుస్తున్న ట్రెండ్‌లో డిజిటల్ వెబ్ సిరీస్‌ల‌దే హవ‌.వెబ్ సిరీస్‌ల ద్వారా చాలామంది స్టార్‌లు కూడా అయ్యారు.నాగబాబు కుమార్తె నీహారిక ..ముద్దపప్పు..ఆవకాయ వెబ్ సీరిస్ తోనే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ చిన్నా చితకా హీరోలు సైతం ఈ వెబ్ ప్రపంచంలో అడుగు పెట్టారు.తాజాగా రానా కూడా ఓ వెబ్ సిరీస్‌లో న‌టించి విజ‌యం కూడా సాధించాడు.హీరో మాధ‌వ‌న్ కూడా ఓ వెబ్ సిరీస్‌లో న‌టించి హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే.హిందీలో నవాజుద్దీన్ సిద్దిఖి, సైఫ్ అలీ ఖాన్, మనోజ్ వాజ్ పేయి, మాధవన్ వంటివారు వెబ్ ప్రపంపంలోకి అడుగుపెట్టారు.

ఎన్టీఆర్ కూడా ఓ వెబ్ సిరీస్‌లో న‌టించి తాను ఏంటో నిరుపించుకోవాల‌ని అనుకుంటున్నాడట‌.అయితే తనలాంటి స్టార్ ని ప్రెజెంట్ చేసే కథ ఉండాలి. డీల్ చేసే గొప్ప దర్శకుడు ఉండాలి. ఏదో ఆశామాషిగా …వెబ్ సీరిస్ చేసేసి మమ అనిపించుకోవాలనే ఆలోచన లేదట. తాను కనుక చేస్తే జనం అలా వెబ్ కు అతుక్కుపోవాలి అంత గొప్పగా ఉండాలని..తనను సంప్రదిస్తున్న నిర్మాతలకు చెప్తున్నారట. మ‌రి ఎన్టీఆర్‌కు అలాంటి క‌థ ఎప్పుడు దొరుకుందో,దొరికిన ఆ క‌థ‌ను తీసే ద‌ర్శ‌కుడు ఎవ‌రున్నారో తెలియాలి అంటే మ‌రి కొంత‌కాలం వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -